ఆ రైతును నేనూ కలిశాను... నాపై కేసు పెడతారా డీజీపీ గారూ?: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేసీఆర్‌ను పొగిడిన నల్గొండ జిల్లా రైతు
- రైతు వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్ట్
- కేసు నమోదు చేసిన పోలీసులు
- జర్నలిస్ట్ చేసిన తప్పేమిటని కేటీఆర్ నిలదీత
ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు. జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశానని, అతనితో మాట్లాడానని వెల్లడించారు. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వీడియోలో ఏముంది?
కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ దొరుకుతుందని, లేకుంటే కంపలో పడి చచ్చిపోయినట్లేనని రైతు మల్లయ్య అన్నారు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా రావాలన్నారు. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక... కరెంట్ లేక వ్యవసాయం లేదని, దీంతో చావాలనిపిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో రైతుబంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా రావాలని, ఆయనకే ఈసారి ఓటు వేస్తామన్నారు.