సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకి స్పెషల్ రైలు... ప్రారంభించిన కిషన్ రెడ్డి
- వారానికి రెండు పర్యాయాలు అందుబాటులో రైలు
- ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
- అటు, వాస్కోడగామా నుంచి ఉదయం 9 గంటలకు రైలు
సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) రైలు బుధ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది.
ఇక, వాస్కోడగామా (గోవా)-సికింద్రాబాద్ రైలు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు వాస్కోడగామాలో బయల్దేరుతుంది.