జానీ మాస్టర్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ షాక్
- లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో జాతీయ పురస్కారం తాత్కాలికంగా నిలిపివేత
- నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ కీలక ప్రకటన
- 2022 ఏడాదికిగానూ జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్
అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా 2022 ఏడాదికిగానూ జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డును అందుకోవాల్సి ఉంది.
ఇదిలావుంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.