హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం
- రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్
- 12న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్
- ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ స్వీప్ చేసిన భారత్
- టికెట్ ప్రారంభ ధర రూ. 750
టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నారు. పేటీఎం ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్‌లలో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు 8 నుంచి 12 మధ్య సికింద్రాబాద్ జింఖానా క్రికెట్ స్టేడియంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి వర్చువల్ టికెట్‌ను పొందొచ్చు. టికెట్ ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ఠ ధర రూ. .15 వేలు.