పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌

Afghanistan Star Cricketer Rashid Khan Wedding in Kabul
  • కాబూల్ లో ఘ‌నంగా ర‌షీద్ వివాహా వేడుక‌
  • నెట్టింట అత‌ని పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌
  • హాజ‌రైన ఆఫ్ఘ‌నిస్థాన్ తోటి క్రికెట‌ర్లు
  • రషీద్ ఖాన్‌తో పాటు అతని ముగ్గురు సోదరులకు ఒకే రోజు వివాహం
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాడు. నిన్న ఆయ‌న పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌ రాజధాని కాబూల్‌లో ర‌షీద్‌ పెళ్లి వేడుక జ‌రిగింది. దీంతో ప్ర‌స్తుతం అత‌ని పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ప్రపంచంలోనే నం.01 టీ20 స్పిన్నర్‌గా ఉన్న ఈ ఆఫ్ఘన్ స్టార్ పెళ్లి పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు నుండి ప‌లువురు క్రికెటర్లు అతని వివాహానికి హాజర‌య్యారు.

ఇక రషీద్ పెళ్లి జరిగిన కాబూల్‌లోని హోటల్ బయట గ‌ట్టి బందోబ‌స్తు క‌నిపించింది. దాని తాలూకు వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా, రషీద్ ఖాన్‌తో పాటు అతని ముగ్గురు సోదరులు ఒకే రోజు వివాహం చేసుకున్నారు.

ఇక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన రషీద్‌కు ప‌లువురు క్రికెట‌ర్లు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

రషీద్ ఈ తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు అన‌డంతో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్‌తోనే కాకుండా అప్పుడ‌ప్పుడు బ్యాటింగ్‌లో కూడా ర‌ప్ఫాడిస్తుంటాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఈ ఆట‌గాడు స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. దీంతో పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50 మరియు 100 వికెట్లు తీసిన బౌలర్‌ గా సహా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా రషీద్ నంబర్‌వ‌న్‌ బౌలర్‌గా నిలిచాడు.
Advertisement
Rashid Khan
Afghanistan
Wedding
Kabul
Cricket

More Telugu News