Chandrababu: ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

CM Chandrababu will tour in New Delhi on Oct 7
  • ఢిల్లీలో కేంద్రం పెద్దలను కలవనునున్న చంద్రబాబు
  • ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం
  • అమరావతికి నిధుల సాయంపై చర్చ 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హస్తినలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. 

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ సందర్భంగా విశాఖ రైల్వే జోన్, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Chandrababu
New Delhi
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News