పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్
- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేకింగ్ శైలి తనకు చాలా ఇష్టమన్న పవన్
- దాంతో పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
- తనను పవన్ మెచ్చుకోవడంపై ఎక్స్ వేదికగా స్పందించిన లోకేశ్ కనగరాజ్
ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "పవన్ సార్ నా వర్క్‌ను ఇష్టపడ్డారని తెలిసి నా మనసు ఉప్పొంగింది. చాలా గర్వంగా ఉంది. బిగ్ థాంక్యూ" అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే హిస్టరీ క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.