కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్
- జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిశోర్
- పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు వెల్లడి
- కొత్త పార్టీ నాయకత్వం తన చేతుల్లో లేదన్న ప్రశాంత్ కిశోర్
కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదన్నారు. రెండేళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు ఆర్డేజీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇక ఈ సంప్రదాయం అంతం కావాలన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది ఏమీ కాదన్నారు. జన్ సూరజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపారు.