Prakash Raj: కేటీఆర్, హీరోయిన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలు... స్పందించిన ప్రకాశ్ రాజ్

Prakash Raj responds on Konda Surekha comments
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో  నటించే ఆడవాళ్ళంటే  చిన్న చూపా?..  #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని, చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డు నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకొని, మదమెక్కి... వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేశారని విమర్శించారు. ఈ విషయం సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Prakash Raj
KTR
Konda Surekha
Naga Chaitanya
Samantha
Tollywood

More Telugu News