హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
- గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానలు
- నేడు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక
- నిన్న కామారెడ్డిలో అత్యధికంగా 97.3 మిల్లీమీటర్ల వాన
నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఎల్లో అలెర్ట్ జారీచేసింది. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి.