ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న అమెజాన్.. జాబ్ వదులుకునేందుకు సిద్ధంగా 73 శాతం మంది ఉద్యోగులు!
- జనవరి 2 నుంచి తప్పనిసరిగా ఆఫీసుకు రావాలంటూ అమెజాన్ ఆదేశాలు
- సీఈవో ఆండీ నుంచి ఇలాంటి ఆదేశాలు వస్తాయని ఊహించలేదన్న ఉద్యోగులు
- గతంలో వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలన్న ఆదేశాలపైనా గుర్రు
- అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అమెజాన్
- అమెజాన్ తాజా నిర్ణయంపై 91 శాతం మంది ఉద్యోగుల అసంతృప్తి
తన కొలీగ్ మరో జాబ్ చూసుకుంటున్న విషయం తమకు తెలుసని 80 శాతం మంది చెప్పగా, ఇప్పటికే కొందరు ఉద్యోగాన్ని వదులుకున్నట్టు 32 శాతం మంది చెప్పారు. అంతేకాదు, జెస్సీ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించలేదని చెప్పారు. కాగా, వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలంటూ గతేడాది ఫిబ్రవరిలో కంపెనీ నుంచి వచ్చిన ఆదేశాలపై అప్పట్లో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని అమెజాన్ రద్దు చేసింది.