ఆ వార్తల్లో నిజం లేదు: జానీ మాస్టర్ భార్య ఆయేషా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ వార్తల్లో నిజం లేదు: జానీ మాస్టర్ భార్య ఆయేషా

johnny master wife ayesha condemned Rumours
  • తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా
  • కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని వ్యాఖ్య 
  • జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారనేది తప్పుడు ప్రచారమన్న ఆయేషా
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడన్న అభియోగంపై జానీ మాస్టర్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ విచారణలో జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, థంబ్‌నెయిల్స్ పై ఆయన భార్య ఆయేషా స్పందించారు. ఓ ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జానీ మాస్టర్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 

జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారంటూ మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని ఆయేషా అన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. ఆమె ఏమి ఆశిస్తోందో తెలియదని అన్నారు. తన భర్తపై చేసిన ఆరోపణలను న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా? అని ఆయేషా ప్రశ్నించింది.

తనకు మాస్టర్ లైఫ్ ఇచ్చారని చెప్పిన అమ్మాయి .. ఇప్పుడు వేధించాడని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. చెప్పుడు మాటలు విని ఆ అమ్మాయి ఇలా చేసి ఉండవచ్చని ఆయేషా అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఓ పెద్ద హీరో ఉండి నడిపిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అది అవాస్తవమని ఆయేషా అన్నారు.
Advertisement
johnny master
Ayesha
Movie News

More Telugu News