India vs Bangladesh: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్

India have won the toss and have opted to field in Kanpur Test
  • కాన్పూర్ వేదిక‌గా భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో టెస్ట్
  • టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రెండు టెస్టుల సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో భార‌త్‌
కాన్పూర్ వేదిక‌గా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. నిన్న రాత్రి వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కొంచెం ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఇక మొద‌ట‌ టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొద‌టి టెస్టులో గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో కూడా విజ‌యం సాధించి క్లీన్‌స్వీప్ చేయాల‌ని చూస్తోంది. 

ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఎలాంటి మార్పులు చేయ‌కుండా తొలి టెస్టులో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగింది. కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంద‌ని, దీంతో ఈ మ్యాచ్‌ తుది జట్టులో మార్పులు ఉంటాయ‌ని వార్తలు వ‌చ్చాయి. దీంతో మ‌రో అద‌న‌పు స్పిన్న‌ర్ జ‌ట్టులోకి రావ‌డం ఖాయమ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చెపాక్ టెస్టులో ఆడిన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే కాన్పూర్ టెస్టుకు రెడీ అయ్యాడు. 

అటు ప్ర‌త్య‌ర్థి బంగ్లా మాత్రం రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. పేస‌ర్లు నహీద్ రాణా, తస్కిన్ అహ్మ‌ద్ స్థానంలో తైజుల్, ఖలీద్‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 7 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది.

భార‌త జ‌ట్టు: రోహిత్ శ‌ర్మ‌, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, రిష‌భ్‌ పంత్, కేఎల్‌ రాహుల్, ర‌వీంద్ర‌ జడేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఆకాశ్ దీప్‌, జ‌స్ప్రీత్‌ బుమ్రా, మ‌హ్మ‌ద్‌ సిరాజ.

బంగ్లా జ‌ట్టు: షద్మాన్, జాకీర్‌ హసన్, నజ్ముల్‌ శాంటో, మొమినుల్‌ హక్, ముష్ఫికర్, షకిబ్, లిటన్‌ దాస్, మెహిదీ హసన్‌ మిరాజ్, తైజుల్, హసన్‌ మహమూద్, ఖలీద్‌ అహ్మద్‌.
India vs Bangladesh
Kanpur Test
Cricket
Team India
Sports News

More Telugu News