Revanth Reddy: 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉంది: రేవంత్ రెడ్డి

Revanth on health profiles degitalisation
  • తక్కువ వైద్యంతో అందరికీ వైద్యం అందించాల్సిన బాధ్యత ఉందన్న రేవంత్
  • 30 రోజుల్లో హెల్త్ కార్డులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి
  • గత చికిత్సల వివరాలను హెల్త్ కార్డుల్లో పొందుపరుస్తామన్న సీఎం
విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. 

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. మరో 30 రోజుల్లో ప్రజలకు హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేయాల్సి ఉందని చెప్పారు. 

ఈ హెల్త్ కార్డ్స్ లో గత చికిత్స వివరాలన్నింటినీ పొందుపరుస్తామని తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy
Congress

More Telugu News