cricketer zadran: ఆఫ్ఘన్ క్రికెటర్ కు శస్త్రచికిత్స పట్ల పంత్ స్పందన

pant wishes speedy recovery of afghanistan cricketer zadran
  • ఎడమ మోకాలి గాయంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్
  • ఇంగ్లండ్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న జద్రాన్
  • సోషల్ మీడియా వేదికగా సర్జరీ విషయాన్ని వెల్లడించిన జద్రాన్
  • స్పందించిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్
ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ ఇంగ్లండ్ లోని ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జద్రాన్ దూరమయ్యాడు. తనకు సర్జరీ విజయవంతం అయిందని జద్రాన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించాడు. సర్జరీ అనంతరం ఆసుపత్రిలో బెడ్ మీద పడుకొని ఉన్న ఫొటోలను ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్టు చేశాడు. 

'మీలో కొందరికి తెలిసే ఉంటుంది. నా మోకాలికి ఈ మధ్యే గాయం అయింది. ఈ రోజు సర్జరీ ద్వారా వైద్యులు దాన్ని ఫిక్స్ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయింది. ఇక కోలుకోవడం మీదనే నా దృష్టంతా' అని జద్రాన్ పేర్కొన్నాడు. దీనికి పలువురు క్రికెటర్లు స్పందిస్తూ 'జద్రాన్.. నువ్వు త్వరగా కోలుకోవాలి' అని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా జద్రాన్ పోస్టుకు స్పందిస్తూ ..'తొందరగా కోలుకోవాలి' అని ఆకాంక్షించాడు. రెండేళ్ల క్రితం కారు యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్ కూడా మోకాలి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
cricketer zadran
Afghanistan
pant
cricket news

More Telugu News