Siddaramaiah: హైకోర్టులో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌కు షాక్!

Karnataka High Court Shocks CM Siddaramaiah
'ముడా' కుంభ‌కోణం కేసులో క‌ర్ణాట‌కు ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ద‌ర్యాప్తు కోసం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా సిద్ధ‌రామ‌య్య దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. మైసూరు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూ కేటాయింపుల విష‌యంలో ఖ‌రీదైన భూముల‌ను త‌న భార్య పార్వ‌తికి ద‌క్కేలా సిద్ధ‌రామ‌య్య కుట్ర చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు.
Siddaramaiah
Karnataka High Court
MUDA Case

More Telugu News