Bandi Sanjay: ఇస్లామోఫోబియా, హిందూ ఫోబియా... ఒవైసీ, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మదర్సాలపై వ్యాఖ్యానించిన బండి సంజయ్ కి ఇస్లామోఫోబియా పట్టుకుందని ఒవైసీ విమర్శించగా... ఒవైసీనే హిందూ ఫోబియాతో బాధపడుతున్నాడని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 

పోలీసులు లేకపోతే 15 నిమిషాల్లో దేశంలోని హిందువులందరినీ హతమార్చుతానన్న వ్యక్తి హిందూఫోబియాతో బాధపడుతున్నట్టే కదా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

ఏనాడైనా ఒవైసీ బ్రదర్స్ కానీ, ఎంఐఎం కార్యకర్తలు కానీ వందేమాతరం గీతాన్ని ఆలపించారా? వాళ్లను ఆపుతున్న ఫోబియా ఏది? అని ప్రశ్నించారు. ఒక్కసారైనా ఒవైసీ హిందూ పండుగల్లో పాల్గొన్నారా, లేక, బొట్టు పెట్టుకుని హిందూ దేవతలకు నమస్కరించారా? అని బండి సంజయ్ నిలదీశారు.
Bandi Sanjay
Owaisi
BJP
MIM

More Telugu News