Srivari Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ

TTD invites CM Chandrababu to Srivari Brahmotsavams
  • అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాలు
  • ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన టీటీడీ అధికారులు, అర్చకులు
  • సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేత
కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు నేడు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి... శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. 

ఇవాళ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు, అర్చకులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Srivari Brahmotsavams
Chandrababu
TTD
Tirumala

More Telugu News