Team India: బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

BCCI announces Team India squad for second test against Bangladesh
  • భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్
  • తొలి టెస్టులో రోహిత్ సేన ఘనవిజయం
  • సెప్టెంబరు 27 నుంచి కాన్పూర్ లో రెండో టెస్టు
  • తొలి టెస్టు ఆడిన జట్టునే రెండో టెస్టుకు ఎంపిక చేసిన బీసీసీఐ
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో రోహిత్ సేన 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

చెన్నైలో జరిగిన ఈ టెస్టులో ఆతిథ్య జట్టు అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి బంగ్లాదేశ్ ను హడలెత్తించింది. తద్వారా సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. అంతేకాదు, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానాన్ని అలంకరించింది. 

ఇక, భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబరు 27 నుంచి కాన్పూర్ లో జరగనుంది. ఈ టెస్టు కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా, అదే జట్టును రెండో టెస్టు కోసం ఎంపిక చేసింది. 

టీమిండియా....
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్,  జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.
Team India
Bangladesh
2nd Test
Kanpur
BCCI

More Telugu News