చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- అశ్విన్‌కు 6.. జడేజాకు 3 వికెట్లు
- రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులకు బంగ్లా ఆలౌట్
- బంగ్లా బ్యాట్స్ మెన్ శాంటో 82 పరుగులు
బంగ్లా బ్యాట్స్ మెన్ లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒక్కడే కాస్త గట్టిగా పోరాడాడు. 82 పరుగులు సాధించాడు. అయితే, అశ్విన్ ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 234 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.