గంజాయి చాక్లెట్లు.. హైదరాబాద్ లో మళ్లీ కలకలం
--
సిటీలో ఇటీవల మత్తుపదార్థాల వాడకం పెరిగిందని, గుట్టుచప్పుడు కాకుండా నగరానికి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని తెలిపారు. దీంతో నిఘా పెంచి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. తనిఖీలలో పలుచోట్ల విద్యార్థులు పట్టుబడుతుండడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.