Revanth Reddy: ఈరోజు ఒకే వేదికను పంచుకోనున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్?

Can Revanth Reddy and KTR share the dias
  • రవీంద్రభారతిలో నేడు సీతారాం ఏచూరి సంస్మరణ సభ
  • సభకు హాజరుకానున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్
  • ఇద్దరూ వేదికను పంచుకుంటారా అనేది ఆసక్తికరం
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో కాసేపట్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరగనుంది. కాసేపట్లో ప్రారంభంకానున్న ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉప్పు, నిప్పుగా ఉండే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ఒకేసారి సభకు వస్తారా? లేక ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వస్తారా? అనేది వేచిచూడాలి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు సంస్మరణ సభకు హాజరవుతున్నారు.
Revanth Reddy
Congress
KTR
BRS

More Telugu News