బుమ్రా కెరీర్‌లో కీలక మైలురాయి... దిగ్గజాల సరసన చేరిన స్టార్ బౌలర్
- అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు సాధించిన స్టార్ పేసర్
- బంగ్లాదేశ్‌పై 4 వికెట్లు పడగొట్టడంతో దక్కిన మైలురాయి
- ఈ ఘనత సాధించిన 10వ భారతీయ బౌలర్‌గా అవతరణ
- 227 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బుమ్రా
అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లను పడగొట్టాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ హసన్ మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా 400వ వికెట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన యార్కర్‌తో తస్కిన్ అహ్మద్‌ను ఔట్ చేసి 401వ వికెట్‌ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.
400 వికెట్ల మైలురాయిని అందుకున్న 10వ భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డులకు ఎక్కాడు. బుమ్రా కేవలం 227 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఈ వికెట్లు సాధించడం విశేషం. వేగంగా ఈ మైలురాయిని సాధించిన 5వ భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 216 మ్యాచ్‌ల్లోనే 400 వికెట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించాడు.
వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్లు వీళ్లే...
1. రవిచంద్రన్ అశ్విన్ - 216 మ్యాచ్‌ల్లో
2. కపిల్ దేవ్ - 220 మ్యాచ్‌ల్లో
3. మహ్మద్ షమీ - 224 మ్యాచ్‌ల్లో
4. అనిల్ కుంబ్లే- 226 మ్యాచ్‌ల్లో
5. జస్ప్రీత్ బుమ్రా-227 మ్యాచ్‌ల్లో