Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌‌తో స్నేహంపై క్లారిటీ ఇచ్చిన నటుడు అలీ

If I will get a chance to act with Pawan Kalyan I will definitely do it says actor Ali

  • ఇద్దరి అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందన్న హాస్యనటుడు
  • అవకాశం వస్తే తప్పకుండా పవన్‌తో కలిసి నటిస్తానన్న అలీ
  • 'ఉత్సవం' మూవీ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాస్యనటుడు అలీ ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉండేది. పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ నటించాడు. వీరిద్దరి స్నేహం కేవలం సినిమాలకే పరిమితం కాదు... వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. అయితే పవన్ స్థాపించిన జనసేన పార్టీని కాదని అలీ వైసీపీలో చేరడం, అనంతర పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయి బిజీగా మారడం, అలీ కూడా పెద్దగా సినిమాల్లో కనిపించకపోవడంతో వీరిద్దరూ తమ స్నేహబంధం గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజాగా ఇద్దరి మధ్య స్నేహంపై అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

‘ఉత్సవం’ మూవీ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడిన అలీ.. ‘‘మా ఇద్దరి అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. పవన్‌తో కలిసి నటించే ఛాన్స్ లభిస్తే కచ్చితంగా చేస్తాను’’ అని స్పష్టం చేశాడు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చాడు. 

అలీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్‌బై చెప్పాడు. ఇక ఎన్నికలకు సుమారు ఏడాది ముందు మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీ చేయడానికి సిద్ధమని అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Pawan Kalyan
Ali
Tollywood
Movie News
Janasena
YSRCP
  • Loading...

More Telugu News