చంద్రబాబు.. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి: అంబటి రాంబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టార్గెట్ చేశారు. ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... 'ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు. అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి దాకా మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు' అని ట్వీట్ చేశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారని ఆయన విమర్శించారు. ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.