Nara Lokesh: ఎక్కడ చదివావో ఏమో... జగన్ ట్వీట్ కు నారా లోకేశ్ కౌంటర్

Nara Lokesh counters Jagan tweet
  • విద్యావ్యవస్థను తిరోగమనంలో తీసుకెళుతున్నారన్న జగన్
  • చంద్రబాబు, లోకేశ్ లను విమర్శిస్తూ ట్వీట్
  • నువ్వు విద్యాశాఖపై లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది అంటూ లోకేశ్ రిప్లయ్
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తిరోగమనంలో తీసుకెళుతున్నారంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఏం చదివావో తెలియదు, ఎక్కడ చదివావో తెలియదు... నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఫేకు జగన్ అంటూ కౌంటర్ ఇచ్చారు. 

కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి, ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థుల పాలిట శాపంలా మారింది. 

సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యం పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వల్ల పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి... వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షల విధానంలో క్రమంగా మార్పులు తీసుకువచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. 

గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంస మామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్ధరిస్తే... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Education System
TDP
YSRCP

More Telugu News