P Narayana: భూ సమీకరణలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న మంత్రి నారాయణ

Minister Narayana procures land from farmers in Amaravati region
  • రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన
  • ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల సేకరణ
  • తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామన్న మంత్రి
  • భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. భూ సమీకరణలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల భూమిని సేకరించారు. 

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి, వారు కోరుకున్న చోట స్థలాలు కేటాయిస్తామని వెల్లడించారు. రైతులు తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములను తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో ఎల్లుండి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. 

ఇక, బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ వరదలు వస్తున్నాయన్న ప్రచారం వైసీపీ కుట్ర అని ఆరోపించారు. 

వరదలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అసత్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే... చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
P Narayana
Land Procurement
Farmers
Amaravati
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News