ఒక్క సెంటీమీటర్ వెనుకంజ.. డైమండ్ లీగ్ ఫైనల్లో రెండో స్థానంలో నీరజ్ చోప్రా
కాగా పారిస్ ఒలింపిక్స్ 2024, ఇటీవల జరిగిన లాసాన్ డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ చోప్రా రెండవ స్థానంలోనే నిలిచాడు. దీంతో డైమండ్ లీగ్‌ను సొంతం చేసుకోవాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టాడు. అయినప్పటికీ నిరాశ తప్పలేదు. అండర్సన్ పీటర్స్ మొదటి ప్రయత్నంలో 87.87 మీటర్ల దూరం విసిరాడు.
26 ఏళ్ల నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో 86.82 మీటర్లు విసరగా.. మూడవ రౌండ్‌లో అత్యుత్తమ త్రో 87.86 మీటర్లు విసిరి టైటిల్ రేసులో నిలిచాడు. జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ 85.97 మీటర్ల త్రోతో మూడవ స్థానంలో నిలిచాడు.
డైమండ్ లీగ్ 2024 -పురుషుల జావెలిన్ త్రో..
1. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 87.87 మీటర్లు ( తొలి ప్రయత్నం)
2. నీరజ్ చోప్రా (ఇండియా) - 87.86 మీటర్లు ( మూడవ ప్రయత్నం)
3. జూలియన్ వెబర్ (జర్మనీ) - 85.97 మీటర్లు ( తొలి ప్రయత్నం)
4, ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా) - 82.79 మీటర్లు (తొలి ప్రయత్నం)
5. జెంకీ డీన్ రోడ్రిక్ (జపాన్) - 80.37 మీటర్లు (నాలుగవ ప్రయత్నం)