Kadambari Jethwani: నటి కాదంబరి జెత్వానీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ పోలీసులు

AP Police files case after Kadambari Jethwani complaint
  • ముంబయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపులు
  • ఏపీ పోలీసులకు ఫిర్యాదు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ముంబయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జెత్వానీ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు నేడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేశారని నటి కాదంబరి జెత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జెత్వానీ ఫిర్యాదు నేపథ్యంలో... కుక్కల విద్యాసాగర్, మరికొందరు వ్యక్తులపై ఇబ్రహీపట్నం పీఎస్ లో కేసు నమోదైంది. 192, 211, 218, 220, 354, 420, 467, 469, 471, రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి కాదంబరి జెత్వానీ ఇవాళ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు అందించారు. 

జెత్వానీ వ్యవహారంలో పలువురు వైసీపీ అగ్రనేతలు, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Kadambari Jethwani
FIR
Police
Andhra Pradesh

More Telugu News