Narendra Modi: మోదీ పుట్టినరోజు నాడు అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో 4 వేల కిలోల శాకాహారం పంపిణీ కార్యక్రమం

On PM Modi 74th birthday Ajmer Sharif will distribute 4000 kg vegetarian langar
  • బియ్యం, నెయ్యి, పండ్లతో పదార్థాన్ని తయారు చేస్తామన్న దర్గా ప్రతినిధులు
  • ఈ పదార్థాన్ని భక్తులు, పేదలకు అందిస్తామని వెల్లడి
  • మోదీ కోసం ప్రార్థనలు చేస్తామన్న దర్గా ప్రతినిధులు
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ 74వ పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా 4 వేల కిలోల శాకాహారాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రధాని గౌరవార్థం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. బియ్యం, స్వచ్ఛమైన నెయ్యి, పండ్లతో తయారు చేయబడిన పదార్థాన్ని భక్తులకు, పేదలకు అందిస్తామని తెలిపింది.

మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని పలు ప్రార్థనామందిరాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని దర్గా ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా తాము 4,000 కిలోల శాకాహారాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం 'సేవా పఖ్వాడా' వేడుకల్లో భాగంగా చేస్తున్నట్లు చెప్పారు.

దర్గాలో 550 ఏళ్లుగా ప్రసిద్ధ బిగ్ షాహీ దేగ్ (పెద్ద పాత్ర)లో ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఈ శాకాహారాన్ని అందులో తయారు చేయనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కోసం ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. శాంతి, సంక్షేమం, ఐక్యత కోసం కూడా ప్రార్థనలు చేస్తామని తెలిపారు.
Narendra Modi
BJP
Rajasthan

More Telugu News