Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. పోలీసుల చార్జ్‌షీట్‌కు భిన్నంగా నటి హేమ స్పందన

Actress Hema Responds Against Police Charge Sheet In Drugs Case
  • బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల చార్జ్‌షీట్
  • నటి హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పేర్కొన్న పోలీసులు
  • వీడియో రిలీజ్ చేసిన హేమ
  • చార్జ్‌షీట్‌లో తన పేరు లేనందుకు హ్యాపీగా ఉందంటూ ఇన్‌స్టా వీడియో
మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు తాజాగా కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు. 1,086 పేజీలున్న ఈ చార్జ్‌షీట్‌లో టాలీవుడ్ నటి హేమతోపాటు 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, హేమ స్పందన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆమె ఓ వీడియోను విడుదల చేస్తూ.. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో తన పేరు లేదని పేర్కొనడం గమనార్హం.

మీకో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానని, తన బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్టు తన లాయర్ ఫోన్ చేసి చెప్పారని అందులో హేమ పేర్కొన్నారు. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారని చెప్పారని పేర్కొన్నారు. తన రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న సంగతిని గతంలోనే మీతో పంచుకున్నానని, ఏ టెస్టులకైనా రెడీ అని అప్పుడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చార్జ్‌షీట్‌లో కూడా పోలీసులు అదే విషయాన్ని పేర్కొన్నారని,  ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని హేమ పేర్కొన్నారు.
Actress Hema
Bengaluru Rave Party
Tollywood

More Telugu News