Vijayawada Floods: సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించిన బాలకృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, విష్వక్సేన్

Tollywood heroes handed over donations to AP CM Chandrababu
  • ఏపీలో వరద బీభత్సం
  • ఉదారంగా స్పందించిన చిత్ర పరిశ్రమ
  • విరాళాలు ప్రకటించిన బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్
ఏపీలో వరద బీభత్సం పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఉదారంగా స్పందించింది. నటులు, టెక్నీషియన్లు ఎవరికి తోచినంత వారు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విష్వక్సేన్ రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో... బాలయ్య, సిద్ధు, విష్వక్సేన్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాము ప్రకటించిన విరాళాల తాలూకు చెక్ లను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. 
Vijayawada Floods
Balakrishna
Siddu Jonnalagadda
Vishwaksen
Chandrababu
Donations
Andhra Pradesh

More Telugu News