సీతారాం ఏచూరి నాకు ప్రియమిత్రుడు: వెంకయ్యనాయుడు
- తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సీతారాం ఏచూరి
- తమ మధ్య చక్కని స్నేహం వెల్లివిరిసిందన్న వెంకయ్యనాయుడు
- ఆయన మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడి
వక్తగా ఎంతో ప్రభావశీలి అని, స్పష్టత ఉన్న పార్లమెంటేరియన్ అని కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నానని, కానీ అంతలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.