కర్నూలులో రైతుకు దొరికిన వజ్రం.. ఖరీదు ఎంతంటే..!
- తుగ్గలి పరిధిలోని బొల్లవానిపల్లెలో ఓ రైతు పొలంలో బయటపడ్డ వజ్రం
- పొలం పనులు చేస్తుండగా రైతుకు దొరికిన వజ్రం
- రూ. 2.50లక్షలకు రైతుకు ఇచ్చి వజ్రం కొనుగోలు చేసిన వ్యాపారి
- బహిరంగ మార్కెట్లో రూ. 5లక్షల వరకు ఉంటుందన్న వజ్రాల వ్యాపారి
అది మాములు రాయి కాదని, వజ్రమని చెప్పడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ వజ్రాన్ని తీసుకుని రైతుకు వ్యాపారి రూ. 2.50లక్షలు ఇచ్చాడు. కాగా, బయట మార్కెట్‌లో ఆ వజ్రం ఖరీదు రూ. 5లక్షల వరకు ఉంటుందని వ్యాపారి తెలిపారు.
ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తుగ్గలి రైతు పొలంలో ఈ వజ్రం బయటపడింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు ఇలాగే వజ్రాలు దొరికాయి. వర్షకాలం మొదలుకాగానే తొలకరి సమయంలో భారీ ఎత్తున జనాలు తుగ్గలిలో వజ్రాల వేటకు వస్తుంటారు.