AP Polics: ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం

central awards ap police
  • ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు
  • అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం   
  • ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. 

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’‌ను అందజేశారు.

AP Polics
AP CID
Amit Shah

More Telugu News