Chandrababu: ఇవాళ పెళ్లి రోజు... చంద్రబాబును కలిసేందుకు వచ్చిన భువనేశ్వరి

Bhuvaneswari came to Vijayawada to meet Chandrababu
  • గత 10 రోజులుగా వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు
  • చంద్రబాబు ఉంటున్న కలెక్టరేట్ కు వచ్చిన భువనేశ్వరి
  • భార్యతో కాసేపు మాట్లాడిన చంద్రబాబు
వరదల నేపథ్యంలో గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉంటున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన బస చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు. అయినప్పటికీ చంద్రబాబు వరద సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

దీంతో, తన భర్తను కలిసేందుకు భువనేశ్వరి విజయవాడలో కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా తన భార్యతో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత తన పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గత పెళ్లి రోజున చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈసారి ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Chandrababu
Nara Bhuvaneswari
Telugudesam
Marriage Day

More Telugu News