తెలంగాణకు ఐదో వందే భారత్ ట్రైన్ .. 15న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
- సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య పట్టాలపై పరుగులు తీయనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
- ఈ నెల 15న వర్చువల్ పధ్ధతితిలో ప్రారంభించనున్న ప్రధాని
- నాగ్‌పూర్‌కు కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుందన్న కిషన్ రెడ్డి
ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్.. నాగ్ పూర్లో ఉదయం 5 గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్ పూర్ చేరుకోనుంది. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని తెలిపారు.