చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
- విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయన్న మల్లారెడ్డి
- వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబు
- ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస
మల్లారెడ్డి ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిరుమలకు ఆయన అలిపిరి నడక మార్గం గుండా చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిరుమలకు వచ్చారు.
మరోవైపు మల్లారెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ... తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పారు. ఒకవేళ వెళ్తే ఆ విషయాన్ని తానే తెలియజేస్తానని చెప్పారు. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ మళ్లీ అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.