హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ కాలేజీలను కూల్చేస్తే మీరే హీరో అంటూ రేవంత్ రెడ్డికి సూచన
- ఓవైసీకి చెందిన కాలేజీని ఎప్పుడు కూల్చేస్తున్నారంటూ ప్రశ్న
- ఆదివారం 30 టీమ్ లతో ఐదు చోట్ల హైడ్రా కూల్చివేతలు
ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ ను ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని, రంగనాథ్ ను నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లేనని రాజాసింగ్ చెప్పారు.