విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- వరద సహాయక చర్యల పర్యవేక్షణతో సీఎం చంద్రబాబు బిజీ
- నేడు వినాయకచవితి
- జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పండుగ జరుపుకున్న చంద్రబాబు
ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

