పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట.. 20కి చేరిన మెడల్స్
- టోక్యో పారాలింపిక్స్ లో 19 పతకాల రికార్డు బ్రేక్
- మంగళవారం ఒక్కరోజే దేశానికి ఐదు మెడల్స్ అందించిన ఆటగాళ్లు
- షూటింగ్ లో అదరగొట్టిన భారత అథ్లెట్లు
మంగళవారం జరిగిన పోటీల్లో తెలుగు తేజం మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నారు. ఇక ఆర్చరీలో పూజా ఖన్నా క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగారు. జావెలిన్ త్రో (పురుషులు) లో అజీత్ సింగ్, సుందర్ గుర్జార్ అద్భుతమైన ప్రతిభ చూపి వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. దీంతో భారత్ కు మరో రజతం, కాంస్య పతకాలు వచ్చాయి. పురుషుల హైజంప్ పోటీల్లో శరద్ కుమార్ రజత పతకం సాధించగా.. మరియప్పన్ థంగవేలు కాంస్య పతకాన్ని సాధించి పెట్టారు. మొత్తంగా 20 పతకాలతో ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత్ 17వ స్థానంలో నిలిచింది.