Jagan: పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా ఇస్తారు?... జగన్ తో చెప్పిన యువతి... వీడియో వైరల్
- విజయవాడలో పర్యటించిన జగన్
- సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ
- సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత
- మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.
కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..."మీకు ప్రభుత్వ సాయం అందిందా... ఇంకా అందలేదా?" అని జగన్ ఓ మహిళను అడగ్గా... పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ... "నీళ్లు మెడ వరకు ఉన్నాయి... పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు" అని స్పష్టం చేసింది.
ఈ వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.

ప్రభుత్వ సహాయం పై బురద చల్లటానికి వెళ్ళిన ఫేక్ ఫెలో. మీకు ఏమి సహాయం రాలేదు కదా అని ప్రశ్నించిన ఫేకు జగన్. సైకో బ్యాచ్ మొత్తానికి షాక్ ఇచ్చిన మహిళ.
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
ఇంత వరదలో ఎవరైనా ఏమి చేస్తారు ? అయినా ప్రభుత్వం చొరవతో మాకు చాలా మందికి ఆహారం అందింది అంటూ, జగన్ మొఖం మీదే చెప్పిన మహిళ. ప్లాన్… pic.twitter.com/rguQjaqHRX