ఏపీ, తెలంగాణలను ఆదుకుంటాం: మోదీ
- తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
- వాగులు, వంకలు, జనావాసాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయం
- కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న ప్రధాని
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చూస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.