హైదరాబాదులో బాలకృష్ణ@50 స్వర్ణోత్సవ వేడుకలు... హాజరైన చిరంజీవి
- 1974లో సినీ కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ
- బాలయ్య సినీ కెరీర్ కు 50 ఏళ్లు పూర్తి
- హైదరాబాదు లో గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కు హాజరైన బాలయ్య దర్శకులు
ఈ నేపథ్యంలో, హైదరాబాదులో ఇవాళ బాలకృష్ణ@50 గోల్డెన్ జూబ్లీ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బాలయ్య బంద్ గలా డ్రెస్ లో మెరిసిపోయారు. ఎప్పట్లాగానే హైఓల్టేజ్ ఎనర్జీతో కనిపించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకావడం హైలెట్ అని చెప్పాలి.
ఇక, బాలకృష్ణతో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు ఈ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు.