కవిత ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు... చర్యలు తీసుకోండి: బీఆర్ఎస్వీ ఫిర్యాదు
- కాంగ్రెస్ సోషల్ మీడియా, నాయకుల అధికారిక ఖాతాల్లో మార్ఫింగ్ ఫొటోలు ఉన్నాయని ఫిర్యాదు
- డీసీపీ దార కవితను కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వీ నేతలు
- అబద్ధపు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
కవిత ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ ఆమె కీర్తిప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులకు సంబంధించి డీసీపీ దార కవితను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి ఖాతాలోని పోస్టులను తొలగించాలని డీసీపీని కోరామన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారం చేస్తే బీఆర్ఎస్వీ విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.