నేటి రాత్రి నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవల బంద్
- ఐదు రోజుల పాటు అంతరాయం
- అపాయింట్ మెంట్లన్నీ రీషెడ్యూల్
- మెయింటనెన్స్ కోసమేనని అధికారుల వివరణ
సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్ మెంట్లు బుక్ చేసుకోవడం వీలు కాదన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ తదితర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్ లైన్ సేవా పోర్టల్ ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ కారణంగా గంటల తరబడి ఎదురుచూసే పనిలేకుండా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అపాయింట్ మెంట్ బుక్ చేసుకుని నేరుగా ఆ సమయానికి వెళ్లవచ్చు. కాగా, సాంకేతిక నిర్వహణలో భాగంగా ఐదు రోజుల పాటు ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పాస్ పోర్ట్ సేవలు పొందాలనుకునే వారికి కొంత అసౌకర్యం తప్పదని అధికారులు తెలిపారు.