వైసీపీకి మరో ఎదురుదెబ్బ... పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
- ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ
- ఎన్నికల తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు
- పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు
- జగన్ కు రాజీనామా లేఖ పంపిన పోతుల సునీత
పోతుల సునీత నేడు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు, శాసనమండలికి పంపించారు. కాగా, పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.
పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్టయింది.