జన్వాడ ఫాంహౌస్ వద్ద అధికారుల కొలతలు.. నెక్ట్స్ ఏంటి?
- కూల్చివేయకుండా అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ప్రదీప్ రెడ్డి
- నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ హైడ్రాకు కోర్టు సూచన
- తాజాగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన
గ్రామ సర్పంచ్ గతంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రామ నక్ష ప్రకారం మొత్తం వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ పరిశీలనలో గుర్తించిన విషయాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఫాంహౌస్ నిర్మాణంలో శంకర్ పల్లి నాలా ఆక్రమణకు గురైందని, ఈ నిర్మాణం జీవో 111 పరిధిలోకి వస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు క్షేత్ర స్థాయిలో కొలతలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫాంహౌస్ కూల్చివేత తప్పదని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఫాంహౌస్ కేటీఆర్ దేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా.. తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని అన్నారు.