కవితకు బెయిల్... కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ ఫోన్
- ఫోన్ చేసి కూతురు బాగోగులు తెలుసుకున్న కేసీఆర్
- కవిత రాక కోసం సిద్ధమవుతున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్
- కవిత అరెస్ట్ అయ్యాక ఇప్పటి వరకు కూతురును కలవని కేసీఆర్
కవిత అరెస్టైన మొదట్లో కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు. అమె అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కూతురును కలవలేదు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు. కూతురు అరెస్టైతే ఓ తండ్రిగా బాధ ఉండదా? అని వాపోయారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన బీజేపీ తన కూతురును ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు.