మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు
- మదనపల్లె సబ్ కలెక్టరేట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన సీఐడీ అధికారులు
- సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువ జాము వరకూ తనిఖీలు
- సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో తనిఖీలు
సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, అదనపు ఎస్పీ రాజ్‌కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం తనిఖీలు చేపట్టింది. దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ తోపాటు, ప్రత్యక్ష సాక్షి నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య, ఘటన ముందు వరకూ ఆఫీసులో ఉన్న ఆర్డీఓ హరిప్రసాద్ లను సబ్ కలెక్టరేట్ కు పిలిపించి సీఐడీ అధికారులు విచారణ చేశారు.